తొలి శుభోదయం ప్రకాశం :-
208 మంది పోలీసు కానిస్టేబుల్ లకు శిక్షణ తరగతుల నేపథ్యంలో, ఒంగోలు కొత్త మామడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , ఇతర పోలీసు అధికారులతో కలిసి ట్రైనింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, బ్యారక్‌లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.
వంట గదిలో అపరిశుభ్రత ఉండటం గుర్తించి వెంటనే మార్పులు చేయాలన్నారు. డైనింగ్ హాల్ లో తలుపులు, పెయింటింగ్ తో బాటు, పైకప్పు నుండి కారుతున్న వర్షపు నీరును గుర్తించి వెంటనే మర్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్ మరియు ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే గ్రౌండ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మైదానం చదునుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రన్నింగ్ ట్రాక్, డ్రిల్ ఏరియా, గార్డెన్ వంటి సదుపాయాలు మరియు అదనపు మౌలిక వసతుల ఏర్పాటు, శుభ్రతపై నిరంతర దృష్టి అవసరమని అధికారులకు సూచించారు.
అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి, ఈ పోలీస్ ట్రైనింగ్‌లో నిపుణుల ద్వారా శిక్షణ తరగతులను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ట్రైనింగ్‌లో నేర్చుకున్న విషయాలు వారి సర్వీస్‌లో సుమారు 35-40 సంవత్సరాలపాటు గుర్తించుకొనే విధంగా శిక్షణ ఇవ్వాలని, ప్రజలకు మైరుగైన సేవలు అందించగలుగుతారని తెలిపారు.
భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, నూతన పద్ధతుల్లో నేరాలను అరికట్టే విధానాలు, పబ్లిక్ రిలేషన్స్ మెరుగుపరిచే నైపుణ్యాలు, ఒత్తిడి నిర్వహణ, సమాజంతో సాన్నిహిత్యాన్ని పెంపొందించే అంశాలపై కూడా శిక్షణ ఇవ్వడం పై చర్చించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ట్రైనింగ్ సెంటర్‌లో మొక్కలను నాటి, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనే విధంగా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, డీపీఓ AO రామ్మోహన్ రావు, పోలీస్ క్లినిక్ డాక్టర్ భానుమతి, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, తాలూకా సీఐ విజయకృష్ణ, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్,ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
