తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ట్రాఫిక్ ఎస్సై దర్శి లోని ఎన్టీఆర్ బస్టాప్ సెంటర్లో సైబర్ క్రైమ్ మరియు రోడ్ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ప్రజలకు ఆన్లైన్ భద్రత, సైబర్ క్రైమ్ నుండి జాగ్రత్తలు, వ్యక్తిగత డేటా రక్షణ, ట్రాఫిక్ నియమాల పాటింపు మరియు రోడ్డు ప్రమాదాలను నివారించే మార్గాలపై వివరంగా అవగాహన కల్పించారు.