తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనాల మేరకు, దర్శి సీఐ రామారావు , ఎస్ఐ మురళి మరియు Road Safety Warriors తో కలిసి దర్శి పట్టణంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బైక్ రైడర్లకు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన బైక్ రైడర్లకు ప్రత్యేకంగా స్వీట్స్ మరియు చాక్లెట్స్ పంపిణీ చేయడం ద్వారా వారికి ప్రోత్సాహం కల్పించారు.అలాగే, సిబ్బంది మరియు Road Safety Warriors బైక్ రైడర్లతో మమేకమై, రోడ్డు భద్రతా చైతన్యం పెంపొందించడానికి, ట్రాఫిక్ నియమాల అవగాహన కల్పించడానికి వివిధ సూచనలు ఇచ్చారు.సీఐ రామారావు మరియు ఇతర అధికారులు, ప్రతి వ్యక్తి రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా యువత, బైక్ రైడర్లు హెల్మెట్ ధరించే పద్ధతిని జీవితంలో భాగంగా చేసుకోవడానికి అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ప్రజల ప్రాణ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మరియు ట్రాఫిక్ క్రమశిక్ష కోసం ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.
