తొలి శుభోదయం ప్రకాశం:-
దిత్వా తుపాను హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ పరిధిలోని,
గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ప్రకాశం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు ప్రకాశం పోలీసు బృందాలు సిద్ధంగా ఉండేలా సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.ప్రకాశం పోలీసులు ప్రజలకు అవసరమైన సేవలు అందించే ప్రభుత్వ విభాగాలు నిరంతరాయంగా పనిచేయడానికి సహకరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తుపాను సమయంలో విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, రవాణా సమస్యలు వంటి పరిస్థితుల్లో ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.దిత్వా తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.