తొలి శుభోదయం కందుకూరు:-
నెల్లూరులో సోమవారం జరిగిన, దివంగత బిజెపి నేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్య కుమార్ యాదవ్, ఇతర నేతలతో కలిసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యేను ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వాజ్ పేయి తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశఅభివృద్ధిలో అనేక మార్పులు వచ్చాయన్నారు. స్వర్ణ చతుర్భుజి పథకం ద్వారా జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. ప్రతిపక్షాలు కూడా వాజ్ పేయి పాలనను మెచ్చుకునేవారని, తన హాస్యచతురతతో విషయాన్ని చక్కగా వివరించేవారని అన్నారు. అలాంటి మహానేత విగ్రహాన్ని నెల్లూరులో ఆవిష్కరించటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. అనేక సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం, వాజ్ పేయి గొప్పతనం గురించి పదేపదే చెబుతుంటారని అన్నారు.
