దివ్యాంగులకు త్వరలో ఉచితంగా త్రిచక్ర మోటార్ వాహనాలు
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించినందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డీఎస్ బీవీ స్వామికి దివ్యాంగుల కృతజ్ఞతలు
తొలి శుభోదయం వెలగపూడి సచివాలయం :-
దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రి డీఎస్ బీవీ స్వామిని దివ్యాంగులు కలిసి….ఇటీవల దివ్యాంగులకు 7 వరాలు (ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అమరావతిలో
దివ్యాంగ్ భవన్, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, క్రీడలకు ప్రోత్సాహం,ప్రత్యేక ఆర్థిక సబ్సిడీలు, బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులలో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, వైద్య, సామాజిక భద్రత) ప్రకటించినందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.6 పింఛన్ ఇస్తున్నాం. దివ్యాంగులకు ఉచితంగా త్వరలో త్రీ వీలర్స్ (రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు) అందిస్తాం. రూ.17.50 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందిస్తాం. దివ్యాంగుల కోసం విశాఖలో రూ. 200 కోట్లకు పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నాం. దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు నాయుడు అన్ని విధాల అండగా ఉన్నారనిమంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.