తొలి శుభోదయం:-
ప్రకాశం జిల్లా ప్రజలకు మరియు పోలీసు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ గారుచీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని, చీకట్లను చెరిపేసే ఈ దీపావళి అందరి జీవితాల్లో నూతన వెలుగులు, శాంతి, సంతోషాలు, అభివృద్ధి నింపాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
అదే సమయంలో, లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ సురక్షితంగా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవినాణ్యమైన, కాలుష్యరహిత టపాసులు కాల్చాలి.పిల్లలు టాపాసులు కాల్చేటప్పుడు తప్పకుండా పెద్దల పర్యవేక్షణ ఉండాలి.మతాబులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలని, సిల్క్ వస్త్రాలు ధరించరాదు. పటాకులను కాల్చేటప్పుడు వాటిని ముఖం, చేతులకు దూరంగా ఉండాలి.బాణాసంచా కాల్చే ప్రదేశం చుట్టూ నీరు, ఇసుక ఇతర అగ్నిమాపక సామాగ్రి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.పాత లేదా దెబ్బతిన్న/సగం కాలిన టపాసులను మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయడం, ముట్టుకోవడం ప్రమాదకరం. దయచేసి అలా చేయకండ.గాజు సీసాలు, రేకు డబ్బాల్లో బాణసంచా కాల్చడం వంటివి చేయరాదు. హాస్పిటల్ వద్ద బాణాసంచా కాల్చరాదు, ప్రజలకు, రోడ్డు వెంబడి వెళ్లే వాహనాలకు ఇబ్బందులు కలగకుండా టపాసులు కాల్చుకోవాలి. పటాకులు కాల్చే ప్రదేశంలో ఇంధనం, వాయు గ్యాస్ సిలిండర్లు ఉండకుండా చూసుకోవాలి.పటాకులు కాల్చిన తర్వాత వెంటనే నీటితో ఆర్పివేయాలి.దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ కు 101, పోలీస్ డయల్ 100/112 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 లకు తెలియ చెయ్యాలని సూచించారు.