తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

    దేశం మెచ్చిన మహానేత ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, సంఘసంస్కర్త,ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రావని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ తెలిపారు.. ఆదివారం న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ భారత పార్లమెంటులో దాదాపు 40 ఏళ్లు వివిధ మంత్రి పదవిలో నిర్వహించడమే కాకుండా భారత ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించారన్నారు..

1946లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడైనప్పటికీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు.భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రి మరియు భారత రాజ్యాంగ పరిషత్ లో సభ్యుడు అని పేర్కొన్నారు.
1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఆ సమయంలో జగ్జీవన్ రామ్ భారత దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారని అన్నారు.
1967- 70 ఆ కాలంలో కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో హరిత విప్లవానికి విజయవంతంగా నడిపిన గొప్ప నాయకుడన్నారు.భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన రికార్డు ఇతనికే సొంతమన్నారు.డాక్టర్ బాబు జగజ్జీవన్ రావ్ ఏ బాధ్యత చేపట్టిన ఆ పదవికి వన్నెతెచ్చారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్,ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ జనరల్ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా,మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాసిం వలి, మార్కాపురం నియోజకవర్గ కేకేసి అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *