తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా పరిధిలోని దోర్నాల పోలీస్ స్టేషన్ను ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పెండింగ్ కేసుల స్థితిగతులు, విచారణ పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, కేసుల దర్యాప్తు నాణ్యత పెంచాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, జనరల్ డైరీ, కేస్ డైరీలు, ఇతర కీలక రికార్డులను నిబంధనల ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా ఆదేశించారు.ప్రజలకు పోలీస్ సేవలు మరింత సమర్థవంతంగా అందించాలంటే పోలీస్ స్టేషన్ పనితీరు మెరుగ్గా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం ఉండరాదని సీఐ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేందుకు విజిబుల్ పోలీసింగ్, ప్రజలతో సత్సంబంధాలు, చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో దోర్నాల ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో చట్టసువ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి పర్యవేక్షణ సందర్శనలు కొనసాగుతాయని సీఐ తెలిపారు.