తొలి శుభోదయం :-
హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియం లో నవంబర్ 23 న జరుగబోయే మాలల రణభేరి మహాసభ విజయవంతం కోసం మాలలను చైతన్యం చేయటం లో బాగంగా హైదరాబాద్ లోని లాలాపేట (వినోబా నగర్) కు వచ్చిన మాల మహానాడు నాయకులకు బండి మహేష్ నాయకత్వంలో ఘనస్వాగతం పలికిన బస్తీవాసులు, దీపావళి పర్వదినం సందర్భంగా మాలల స్మశాన వాటికలో పూర్వీకుల సమాధుల వద్ద జరుగుతున్న పూజల్లో బస్తీ వాసులతో కలిసి పాల్గొన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు , అనంతరం బస్తీలో డివిజన్ అధ్యక్షులు బండి మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 150 సంవత్సరాలుగా మాలలు ఉపయోగిస్తున్న బొందల గడ్డను కొందరు కబ్జా చేయటానికి యత్నిస్తూ, అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని, అధికారులు అభివృద్ధి పనులు ప్రారంభించి కబ్జాకోరుల నుంచి కాపాడాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య కోరారు మాలలు ఐక్యంగా ఉండి పోరాడితేనే హక్కులు సాధించుకోవచ్చని ఎస్సీ వర్గీకరణ తో మాలలకు 5% కేటాయించి అన్యాయం చేసిన ప్రభుత్వం, రోస్టర్ పాయింట్ల కేటాయింపు తో 1% ఉన్న వారికంటే 5,% ఉన్న మాలలకు విద్యా,ఉద్యోగ అవకాశాలు తక్కువ వచ్చేలా సబ్ కమిటీ మంత్రులు కొందరు కుట్ర చేశారని, ఈ కుట్రలను తిప్పి కొట్టి మాలల న్యాయ బద్ధమైన హక్కుల సాధన కోసం నవంబర్ 23 న హైదరాబాద్ లో జరిగేy మాలల రణభేరి మహాసభ కు మాలలంతా తరలిరావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు కోరారు ఈ కార్యక్రమంలోమాల మహానాడు హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జై కుమార్ సికింద్రాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నేతల రమేష్ రమాదేవి పుష్ప పద్మ సత్యనారాయణ రామ్ చందర్ ఆర్ మల్లేష్ శ్రీనివాస్ బాలకృష్ణ నవీన్ శేఖర్ రమేష్ సత్యనారాయణ లక్ష్మణ్ కరుణ ఆదిలక్ష్మి తదితర బంధుమిత్రుడు