తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులు నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ (PDS) బియ్యాన్ని తరలిస్తున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 4 వాహనాలు ను స్వాధీనం చేసుకుని, మొత్తం 545 బియ్యం బస్తాలను పట్టుకున్నారు.
ప్రభుత్వ ప్రజా పంపిణీ పధకం (PDS) ద్వారా ప్రజలకు అందించే బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *