తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మనబ్రోలు ఎస్సీ కాలనీలో జూదం ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిని ఎస్‌ఐ ,నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, అక్కడ జూదం ఆడుతున్న 5 మంది జూదరులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.15,140/- నగదుతో పాటు 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన వారిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలు జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *