తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయం నుండి పట్టణంలోని పురవీధుల గుండా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది…ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు, టీచర్స్ సంఘాల నాయకులు పాల్గొన్నారు…సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి టి ఆవులయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేసేంతవరకు కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని అన్నారు. స్వతంత్రం రాక ముందు
నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా తీసుకురావడం కార్మిక వర్గాన్ని ఉరి తీయడమేనని అన్నారు..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్మిక వర్గానికి వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చాలామంది స్కీం వర్కర్లు రోడ్లపై కొచ్చి ఆందోళన చేశారని ఇప్పటికైనా సరే కోటమీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రకటన చేయాలని అన్నారు. లేనిపక్షంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అన్నారు. యుటిఎఫ్, ఏపీటీఎఫ్ టీచర్ సంఘాల నాయకులు ఎం సత్యనారాయణ రెడ్డి ,ఎలా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఈ నిర్ణయాలను రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగులు, టీచర్స్ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ఎన్నికల అప్పుడు సిపిఎస్ రద్దు చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, పిఆర్సి కమిషన్ వేయకుండా ఉద్యోగుల కార్మికులను అవమాన పరుస్తున్నారని అన్నారు.
ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందినయని అందుకు నిదర్శనం దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన జాతీయ సమ్మె అని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బి నరసింహులు డి శ్రీనివాసులు వివిధ సంఘాల నాయకులు డి రుతమ్మ, డి స్వర్ణ, జి ఆనంద్ రావ్ ,నాగలక్ష్మి, జి విశ్రాంతమ్మ , ఏ మునెమ్మ, సాయి లక్ష్మి, నూర్జహాన్, మురళి, ఎం సరోజ, ఏ వెంకటేశ్వర్లు ఎం పిచ్చిరెడ్డి ఏ కుమారి ఎస్.కె మౌలాబి తదితరులు పాల్గొన్నారు