తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

కార్మికులను బానిసలుగా మారుస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం గిద్దలూరు పట్టణంలోని సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది.
సందర్భంగా సిఐటియు నాయకులు టీ ఆవులయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో సమ్మె చేసిన కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాల మనవి వినకుండా ఏప్రిల్ ఒకటో తేదీ నుండి బుధవారం నుండి 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా అమలు చేయడం కార్మికులను బానిసలుగా మార్చడమేనని అన్నారు.
ఈ లేబర్ కార్డు అమలుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ నిరసన ఆర్టీసీ ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని డ్యూటీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు పి శ్రీనివాసులు ఎన్ వీరయ్య ఓబులేసు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఎం మురళి డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *