తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

రాత్రివేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టి, డ్రైవర్లు మరియు ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్నంగా ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1:00 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.నిద్రమత్తు, అలసట కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో, హైవేలపై వెళ్తున్న వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడుక్కునే సౌకర్యం కల్పిస్తూ, టీ అందించి వారిలో చైతన్యం నింపుతున్నారు. డ్రైవర్లకు కేవలం గమ్యం చేరడమే కాదు, వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల భద్రత కూడా ముఖ్యమని పోలీసులు సూచిస్తున్నారు.కొద్దిపాటి విశ్రాంతి, అప్రమత్తత ప్రాణాలను కాపాడుతుందని అవగాహన కల్పిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా రాత్రి ప్రమాదాలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *