తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండలం, పోతకమూరు గ్రామ చెరువు వద్ద నిర్వహించిన “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు బి. పూర్ణ చందు (డిఈఈ), ఎం. సుబ్బారావు (ఏఈ – తాళ్లూరు మండలం నోడల్ ఆఫీసర్), వై. విజయరత్నం (ఏఈ – దర్శి మండలం నోడల్ ఆఫీసర్), బి. రవీంద్ర రెడ్డి (ఏఈఈ – కురిచేడు మండలం నోడల్ ఆఫీసర్) తదితరులు హాజరయ్యారు.ప్రజా ఉద్యమంగా నీటి భద్రతను తీసుకెళ్లాలని, 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా కాల్వలు, చెరువులు, చెక్ డ్యాంలను బాగు చేసి నీటి నిల్వకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ –
నీటి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సాగు నీటి సంఘాలు నీటి వనరుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. నీటి కాలుష్యాన్ని నివారిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.రైతులకు సుస్థిర నీటి సరఫరా అందించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించగలమని తెలిపారు.“పరిగెత్తే నీటిని నడిపించాలి… నడిచే నీటిని నిలబెట్టాలి… నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి” అని ఆమె పిలుపునిచ్చారు.డ్రిప్ వ్యవసాయం నుంచి డ్రోన్ వ్యవసాయం వరకు రాష్ట్రం ముందుకు సాగిందని, నీటి సంరక్షణ ఉంటేనే భవిష్యత్తు సురక్షితం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, నీటి సంఘం DC అధ్యక్షులు వెలుగొండారెడ్డి, శ్రీను, సుబ్బారావు, కోటేశ్వరరావు తదితరులతో పాటు పోతకమూరు, చెరుకుంపాలెం, పాపిరెడ్డి పాలెం గ్రామాల నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ, వార్డు స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
