తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగు నీటి కాలువల నిర్వహణ మరియు నీటి పొదుపుపై అవగాహన సభ.నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి రైతు భాగస్వామి కావాలి. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని చాలా సాగునీటి కాలువలలో పూడిక తీశాం.పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు మండలం గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగునీటి సంఘాల నేతలు మరియు రైతులతో ర్యాలీ అనంతరం అవగాహన సదస్సు జరిగింది.