తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:*
ప్రజలకు నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారతీయ న్యాయ వ్యవస్థలో అమలులోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాలు, వాటి ముఖ్యాంశాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు, నేరాలపై నమోదయ్యే కేసుల విధానం, శిక్షలు తదితర అంశాలపై వివరించారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, యువత, వృద్ధులు తమకు సంబంధించిన చట్టపరమైన హక్కులను తెలుసుకోవాలని సూచించారు.నూతన చట్టాల ద్వారా నేరాల దర్యాప్తు మరింత వేగవంతంగా, పారదర్శకంగా జరుగుతుందని, బాధితులకు న్యాయం త్వరగా అందే విధంగా ఈ చట్టాలు రూపొందించబడ్డాయని పోలీసులు తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా నేరాలకు దూరంగా ఉండటంతో పాటు, సమాజంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.ప్రజలు ఎలాంటి చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, చట్టాలను గౌరవిస్తూ సహకారం అందించాలని కోరారు. నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరం నిర్వహిస్తామని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.