తొలి శుభోదయం మార్కాపురం పోలీస్:-

ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, మహిళలు మరియు పిల్లలకు భద్రత కల్పించడం, నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం పోలీసులు నూతన క్రిమినల్ చట్టాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, ఆన్‌లైన్ మోసాలు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు సంబంధించి ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ చీటింగ్ వంటి వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాలను వివరించారు.అలాగే నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పిస్తూ, చట్టాల ప్రకారం నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అడ్డుకోవడంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని తెలిపారు.మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, హక్కులు గురించి వివరించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్ సహాయం పొందేందుకు ఉపయోగపడే Shakti App ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం మరియు మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరగడమే కాకుండా, నేరాల నివారణలో పోలీస్ శాఖకు ప్రజల సహకారం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని మార్కాపురం జిల్లా పోలీసులు వెల్లడించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *