తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి పోలీసులు నెత్తివారిపాలెం గ్రామ పొలాల్లో జరుగుతున్న పేకాట (Gambling) శిబిరంపై ఎస్.ఐ మరియు పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 1750/- నగదును మరియు పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం వల్ల కుటుంబాలు చితికిపోతాయని, యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.