నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ విలేకరుల సమావేశాల్లో కోటంరెడ్డి మాట్లాడుతూ…… రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేందుకు 3-ఫేస్ మరియు 24 గంటల కరెంటు కోసం 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రమంతటా కూడా కరెంటు పనులు శరవేగంగా సాగుతున్నాయి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
నెల్లూరు రూరల్ లో 97% పనులు పూర్తిచేశాం. మరో 10 రోజుల్లో పనులు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయబోతున్నా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు .
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో వివిధ రంగాలలో కోట్లాదిమంది ప్రజలకు మేలుచేసే అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కోట్లాదిమంది ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో 18 గ్రామాలు, 3 డివిజన్లలో 28వేల కుటుంబాలకు షుమారు 80వేల మంది ప్రజలకు కరెంటు కష్టాలు తీర్చే అభివృద్ధి పనులు అతి త్వరలో పూర్తికాబోతున్నాయి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు . ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ‘చంద్రన్న విద్యుత్ వెలుగులు’ పేరుతో అతి త్వరలో ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , యువనేత నారా లోకేష్ , భారత ప్రధాని నరేంద్రమోడీ ఆశీస్సులతో చేపట్టిన ఈ బృహత్తర-మహోత్తరమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలుచేస్తుంది అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.