తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధమ కర్తవ్యంగా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు, ఆయా జిల్లాల పరిధిలోని పట్టణాలు, గ్రామాలు మరియు జాతీయ రహదారులపై పోలీసులు ముమ్మరంగా ‘నైట్ బీట్’ (Night Beat) నిర్వహిస్తున్నారు.అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను నిలదీయడమే కాకుండా, వారి వేలిముద్రలను ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎంలు మరియు వ్యాపార సముదాయాల వద్ద నిరంతరం గస్తీ కాస్తూ దొంగతనాలకు తావులేకుండా ‘విజిబుల్ పోలీసింగ్’ నిర్వహిస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడానికి పోలీసులు అప్రమత్తంగా ఉంటూ, అడుగడుగునా నిఘా ఉంచుతున్నారు.ఏదైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని, నేర రహిత సమాజం కోసం పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.