తొలి శుభోదయం ప్రకాశం:-
శాంతి భద్రతల పరిరక్షణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకం.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, ఉపవిభాగం స్థాయి నిఘా కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కోతపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పర్యవేక్షణలో నిర్వహించగా, ఇటీవల వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్ విధానాలు, వారి కదలికలపై ఆటో డ్రైవర్లను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వారి ప్రవర్తన, ప్రయాణ నమూనాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే నేరాల నివారణలో కీలక పాత్ర పోషించవచ్చని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను చూసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు నేరాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇలాంటి అప్రమత్తత కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.