తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులు, బైపాస్ రోడ్లలో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు, నంబర్ ప్లేట్లు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలిస్తున్నారు.నేర నివారణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల అరికట్టడం, మరియు ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.ప్రకాశం పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు —వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి వివరాలు వెంట ఉంచుకోవాలి.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వాలి.ప్రకాశం పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణ కోసం అప్రమత్తంగా ఉన్నారు.