తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే–16 (NH-16) పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై విస్తృతంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ను జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పర్యవేక్షణలో సమర్థవంతంగా చేపట్టారు.డ్రైవ్ సందర్భంగా హైవే పై వేగంగా ప్రయాణించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, సీట్‌బెల్ట్ లేకపోవడం, ఓవర్‌లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన పత్రాల లేమి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘనలు వంటి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి, సంబంధిత డ్రైవర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. హైవేలపై చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని గుర్తు చేస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్, వాహన పత్రాలు, సురక్షిత వేగ పరిమితి వంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ప్రజల సహకారమే రోడ్డు భద్రతకు ప్రధాన ఆస్తి అని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని సూచించారు.ప్రకాశం జిల్లా పోలీసులు ఇటువంటి డ్రైవ్‌లను నిరంతరం కొనసాగిస్తూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు.
