తొలి శుభోదయం కందుకూరు:-

లాడే సందర్భంగా కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల సేవాధికార సంఘం చైర్మన్ శ్రీమతి ఎం శోభ మాట్లాడుతూ భారత పౌరులందరికీ సమాన న్యాయం అందాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగం రూపొందించబడిందని అన్నారు. మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులందరికి లాడే శుభాకాంక్షలు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎమ్ శోభ తెలియజేశారు. అడిషనల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎన్. నిఖిల్ రెడ్డి గారు న్యాయవాదుల అందరికీ శుభాకాంక్షలు తెలిపి కేసులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.శ్రీధర్ నాయుడు సీనియర్ న్యాయవాదులు టి. తిరుమలరావు, షేక్ జమీర్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *