తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పునాయుడుపాలెం:-

పంచాయతీల ప్రత్యేక అధికారులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన పంచాయితీల ప్రత్యేక అధికారులతో తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాల పంచాయతీ ప్రత్యేక అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….పంచాయతీల ప్రత్యేక అధికారులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి. గ్రామాల్లో సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలి. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీధిలైట్లు లేని చోట వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అధికారులంతా గ్రామాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *