తొలి శుభోదయం :-
గిద్దలూరు మండలం, వెల్లుపల్లె గ్రామానికి చెందిన కొర్ర రామయ్య అనేరైతుతానుసాగుచేసుకుంటున్న పంట పొలంలో ఎనిమిది నెలల క్రితం బొప్పాయి పంట వేసి ఉన్నాడు. అయితే బొప్పాయి పంటకు తెగులు వచ్చి పంట మొత్తం నష్టపోగా, తాను సాగు చేస్తున్న భూమి అసైన్మెంట్ కావటంతో, ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారంతనకువర్తించకపోవటంతో, తన పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నష్టపోయిన రైతుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు శనివారం సాయంత్రం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో కొర్రా రామయ్య అనే రైతుకు తన వంతు సహకారంగా రూ 20,000-00 లు అక్షరాల ఇరవై వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైతుల పట్ల చూపిన ఔదర్యానికి ప్రతీ ఒక్కరూ హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యకార్యక్రమంలో రైతు నాయకులు బద్రి గోపాల్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంకర వెంకట రెడ్డి, దొంతరి రామయ్య, అల్లం రంగస్వామి, ఎస్ తిరుపతయ్య తదితరులు పాల్గోన్నారు