తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్ ( పీ-4) కార్యక్రమ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సహాయం చేయడంలో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపిక అయిన వారిని సోమవారం ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ గారు మాట్లాడుతూ అభివృద్ధి పరంగా సమాజంలో టాప్ -10 స్థానంలో ఉన్నవారు, పేదరికంతో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి వెన్నుదన్నుగా నిలిచేలా ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించినట్లు చెప్పారు. సమాజం అందించిన సహకారంతో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు తిరిగి సమాజానికి సహాయం చేసేలా ముందుకు రావాలని జనార్దన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో తాను కూడా ఒక ట్రస్టును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మా డీజేర్ ట్రస్ట్ తరుపున ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులను టాలెంట్ టెస్ట్ ద్వారా ఏంపిక చేసి ఉచితంగా చదివించడం జరుగుతున్నది అన్ని తెలిపారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో ముందుకు రావాలని జనార్దన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ రియాజ్ , పిడిసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, ఆర్డీవో , కమీషనర్ మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది.