తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర భద్రతా చర్యలు అమలు చేస్తోంది. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేసి, నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయగలిగేలా ట్రాఫిక్ నియంత్రణ, పహారా బలగాలు, అనుమానాస్పద వ్యక్తులపై కఠిన నిఘా వంటి చర్యలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా “విజిబుల్ పోలీసింగ్” ద్వారా పోలీసుల ఉనికిని స్పష్టంగా చూపిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భద్రతా భావనను పెంచుతున్నారు.పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రశాంత వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించి పరీక్షల సమయంలో శాంతి భద్రతలను కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *