తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి మండలం, పోతావరం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులతో వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, ఆర్డీఓ శ్యాంసన్ గారు, దర్శి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారు, ఎంపీడీఓ కల్పన గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు గారు, టౌన్ టిడిపి అధ్యక్షులు కులాలచెరువు సత్యనారాయణ గారు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.