తొలి శుభోదయం సింగరాయకొండ :-

సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ముందుగా కొత్తకోట వెంకటరావు ఇంటి వద్ద నుంచి ఊరేగింపుతో ఆలయ ప్రాంగణం వద్దకు రధముతో గోపయ్య తిరుపతమ్మ అమ్మవారు తీసుకువచ్చి పాలేటి రాఘవ గ్రామ పురోహితుడిచే కళ్యాణాన్ని నిర్వహించారు వల్లూరి కోటేశ్వరరావు వారి తండ్రి జ్ఞాపకార్థం నాయి బ్రాహ్మణ పేద విద్యార్థికి నాదస్వరం బహుమతిగా అందజేసి వారి కళకు ప్రోత్సహించారు అనంతరం నాదస్వర కచేరి నిర్వహించారు తరువాత గ్రామంలో ప్రజలందరికీ తీర్థ ప్రసాదాలు పంచిపెట్టి శివాలయ ఆలయ ప్రాంగణంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల వారిని గ్రామ పురవీధులలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం పట్ల భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించి సంతోషాన్ని వ్యక్తం చేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *