తొలి శుభోదయం సింగరాయకొండ:-
తొలుత జాతీయ పతాకావిష్కరణ జరిగింది. పాకల సర్పంచ్ సైకం చంద్రశేఖర్, ఉప సర్పంచ్ బల్లెల ప్రభాకర్ రెడ్డి, ఎంపిటిసి అశోక్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ వాయల తిరుపతి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు కోటపాటి నారాయణ మొదలగు వారు పాల్గొన్నారు. తర్వాత జరిగిన సభా కార్యక్రమంలో వక్తలు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గూర్చి కొనియా డారు. ఈ కార్యక్రమంలోపూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ బి హరిబాబు సహకారంతో పూర్వ విద్యార్థుల సంఘం ముఖ్య సభ్యులు మరియు యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బుర్ల కోటిరెడ్డి సౌజన్యంతో అమెరికాలోని డేట్రాయిట్
మిచిగాన్ లో ప్రపంచవ్యాప్తంగా బాలిక విద్య సాధికారత కొరకు కృషి చేస్తున్న “లెర్నింగ్ బ్రిడ్జి ఆర్గనైజేషన్” ఫౌండర్ పర్ణిక ఇంజేటి పాఠశాలకు బహుకరించిన రెండు
లాప్ టాప్ లు ఉపాధ్యాయ సిబ్బంది సమక్షంలో డాక్టర్ బి. హరిబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.పాఠశాల విద్యార్థినులు షణ్ముఖ ప్రియా, సహస్ర, పాయల్, షమత, సంహితమాధురి మొదలగు విద్యార్థులు రిపబ్లిక్ డే గురించి చక్కగా ఉపన్యసించారు. రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన డిబేట్, దేశభక్తి గేయాలు పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.డిబేట్ లో షణ్ముఖ ప్రియ, పాయల్, సహస్ర దేశభక్తి గేయాలలో కీర్తన,
పి. లాస్య, సంహిత మాధురి మొదలగువారు మొదటి, రెండవ, మూడవ బహుమతులను గెలుచుకున్నారు.