తొలి శుభోదయం న్యూస్ :-

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద శనివారం అట్టహాసంగా ప్రారంభమైన “పాకల బీచ్ ఫెస్ట్‌” లో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించాను. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత–నృత్య ప్రదర్శనలు, ప్రత్యేక క్రాకర్స్ షో ప్రజలను విశేషంగా ఆకట్టుకోవడం ఆనందదాయకం. కార్యక్రమంలో సహచర మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి , కందుల దుర్గేష్ , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , జిల్లా ఎమ్మెల్యేలు మరియు కూటమి పార్టీల ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నాను. పర్యాటకోత్సవాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతూ ప్రకాశం జిల్లాను రాష్ట్ర పర్యాటక పటంలో ప్రత్యేక స్థానంలో నిలపడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *