తొలి శుభోదయం సింగరాయకొండ:-
కొండేపి నియోజకవర్గ సింగరాయకొండ మండలంలోని పాకల పంచాయితీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుగుణంగా కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెం మరియు పోతయ్య గారి పాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రచ్చబండ కార్యక్రమంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాకల గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మెడికల్ కాలేజీ లను ప్రవేట్ పరం చేస్తే మరెన్నో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కేశవరపు కృష్ణారెడ్డి మండల పార్టీ ఉపాధ్యక్షులు గొల్లపోతు గోవర్ధన్ రావు గోళ్లమూడి అశోక్ రెడ్డి, బల్లెల ప్రభాకర్ రెడ్డి, ప్రసన్న కుమార్ వాటుపల్లి భగవంతరావు బుజ్జమ్మ నాయుడు రవి సైకం నారాయణ బొమ్మిడి నాగరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పోతయ్య గారి పాలెం నుంచి వాయలు తాతయ్య, విజయ్, జాలయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
