తొలి శుభోదయం సింగరాయకొండ:-

పాత శింగరాయకొండ గ్రామంలోని శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురవుతుండటంపై MRPS, యువనేస్తం ఫౌండేషన్, రైతు కూలీ సంఘం నాయకత్వంలో స్థానిక ఎం.ఆర్.ఓ (MRO) ని కలిసి గిరిజనుల తరుపున వినతిపత్రం సమర్పించడం జరిగింది.గత కొంతకాలంగా గ్రామంలోని నిరుపేదలకు, గిరిజన లకు చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని ఒక వ్యక్తి పూడ్చిన మృత దేహాలను దున్ని అక్రమంగా కబ్జా చేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో అంత్యక్రియలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఎం.ఆర్.ఓ దృష్టికి తీసుకువెళ్లాము. ఈ స్థలాన్ని వెంటనే కబ్జా నుండి విడిపించి, చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని కోరాము.
మా విన్నపంపై సానుకూలంగా స్పందించిన ఎం.ఆర్.ఓ , శ్మశాన వాటిక స్థలాన్ని తనిఖీ చేసి, కబ్జాదారుల నుండి ఆ భూమిని కాపాడుతామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో MRPS కొండపి నియోజగవర్గ ఇంచార్జి రేణమాల మాధవ మాదిగ,రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు సాగర్, రైతు కూలీ సంఘం నాయకులు రావినూతల మోహన్ , ఎమ్మార్పీఎస్ మండల కో కన్వీనర్స్ సూరపోగు మోజెస్ మాదిగ, పొనుగోటి ఉదయ్ కుమార్ మాదిగ , బాలి రెడ్డి నగర్, గుజ్జుల్ యలమంద రెడ్డి నగర్, మల్లి ఖార్జున నగర్, పోతుల చెంచయ్య కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *