తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, అర్ధవీడు పోలీసు స్టేషన్ సిబ్బంది పాపినేనిపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ మద్యం సేవనంపై ప్రత్యేక పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పేరుకుపోయిన మద్యం బాటిళ్లు, గ్లాసులు మరియు ఇతర చెత్తను గుర్తించి, గ్రామంలోని యువకుల సహకారంతో ఆ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రపరిచారు.సార్వజనిక ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని పోలీసులు గుర్తుచేస్తూ, గ్రామంలోని శాంతి భద్రతల కోసం అందరూ చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.