తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

ప్రభుత్వ ప్రాధాన్యత లో గ్రామ పంచాయతీ లో ప్రజాపాలన దిశగా పారదర్శకత రెవెన్యూ సంస్కరణలు, రెవెన్యూ రికావరి ల పై ప్రత్యేక దృష్టి పెట్టి సేవలు అందించాలని సింగరాయకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎన్ వి బి రాజేష్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ పాలక వర్గాల కాలపరిమితి ముగియడం తో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దానితో సింగరాయకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా తహసీల్దార్ ని ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. దానితో ఈ నెల మూడవ తేదీ బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు చేపట్టిన రాజేష్ శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ సిబ్బంది తో గ్రామ పంచాయతీ పరిస్థితి, రెవెన్యూ రికావరి, పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత మేరకు ప్రజలకు పారదర్శక పాలన అందించాలని ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేవిధంగా సేవలు అందించాలని ఆదేశించారు. పారిశుధ్యం, పన్ను వసూలు, ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, ప్రజలకు కార్యాలయ సేవలు పారదర్శకంగా అందించాలని సిబ్బందిని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *