తొలి శుభోదయం గిద్దలూరు:-
గిద్దలూరు పట్టణం. ..
మున్సిపాలిటీ పరిధిలోని కొంగలవీడు రోడ్డులో చోటుచేసుకున్న చిన్న సంఘటన పెద్ద సందేశాన్ని ఇచ్చింది. చెత్త బండి రాగానే ఆ వీధి చిన్నారులు షెక్ షిద్రా,బత్తుల రుషిత ఇంటింటి నుంచి పొడి–తడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం అభినందనీయం. బాధ్యత పెద్దలకే పరిమితం కాదని, చైతన్యం ఉంటే చిన్నారులూ మార్పుకు దారి చూపగలరని ఈ ఘటన చాటి చెప్పింది.
ఈ దృశ్యాన్ని గమనించిన మున్సిపల్ కమిషనర్ రమణబాబు చిన్నారులను అభినందించి చాక్లెట్లు పంచడం కేవలం ప్రోత్సాహం మాత్రమే కాదు—పారిశుద్ధ్యంపై అవగాహనకు అధికారుల మద్దతు కూడా ఉందనే సంకేతం. పట్టణం సుందరంగా మారాలంటే ప్రతి పౌరుడిలో ఇదే స్పూర్తి అవసరం.తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు బాల్యంలోనే అలవాటు చేసిన శుభ్రత సంస్కారం భవిష్యత్తులో శుభ్రమైన సమాజానికి బాటలు వేస్తుంది. కొంగలవీడు చిన్నారులు చూపిన మార్గం గిద్దలూరంతా అనుసరించే రోజే నిజమైన అభివృద్ధి ప్రారంభం