తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
- కొడవలూరులో టిడిపి నాయకుల భారీ ర్యాలీ.
వేమిరెడ్డి దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో ప్రతిధ్వనించిన కొడవలూరు-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలోని కూటమి ప్రభుత్వ నేతలకు కృతజ్ఞతలు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు కొడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ర్యాలి నిర్వహించారు. అమరావతి మన రాజధాని అంటూ కార్యకర్తల నినాదాలతో కొడవలూరు గ్రామ వీధులు మారు మోగాయి.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.