తొలి శుభోదయం టంగుటూరు :-
పురుగుమందుల అవశేషాల నిర్మూలన మరియు పొగాకేతర అన్యపదర్ధాలు నిర్మూలన మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందుగా పొగాకు తోటలను మరియు పొగాకు క్యూరింగ్ లను పరిశీలించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ పొగాకు తోటలలో NIRCA (CTRI) మరియు పొగాకు బోర్డు సిఫారసు చేసిన పురుగు మందులనే వాడాలని తెలిపారు.
పొగాకు లద్దె పురుగు నివారణకు
పొగాకు లద్దె పురుగు నివారణ కొరకు ఇమామెక్టిన్ బెంజోయేట్ @ 5 గ్రా. నీ 10 లీ. నీటిలో పిచికారి చేయాలని తెలిపారు.
తెల్ల దోమ మరియు పేను బంక నివారణకు
తెల్ల దోమ మరియు పేను బంక నివారను కొరకు ఇమిడాక్లోప్రిడ్ @ 2.5 మి. లీ. లేక థయామిథోక్సామ్ 25 డబ్ల్యు.జి. @ 2 గ్రా. లేక ఫ్లోనికామిడ్ @ 4 గ్రా.10 లీ. నీటిలో లేదా పైమెట్రోజిన్ @ 4 గ్రా. 10 లీ. నీటిలో పిచికారి చేసుకోవాలన్నారు. రైతులు తాము పండించిన పొగాకులో పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నట్లయితే అటువంటి వారి మీద రూ. 5000.00 జరిమానా విదిస్తారని తెలిపారు.పొగాకు పొలం లో లింగకార్షణ బుట్టలు మరియు పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవడం వలన పంటలో పురుగు ఉధృతిని తెలుసుకోవచ్చని తెలిపారు.పొగాకు గ్రేడింగ్ చేసేటపుడు పొగాకేతర అన్య పదార్థాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు.ఈ సంవత్సరం కొన్ని గ్రామాలలో పొగ తోటలలో పొగాకు మల్లెను గుర్తించడం జరిగింది కావున పొగాకు మల్లె వచ్చిన పొలం లో పొగాకు మల్లెను పూత దశకు రాక మునుపే పీకివేసి పొలం బయట గుంత తీసి గుంతలో కాల్చి వేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఫీల్డ్ ఆఫీసర్ జి. ఉపేంద్ర, ఐటీసీ కంపెనీ ప్రతినిధి వెంకట రావు , జీపీఐ కంపెనీ ప్రతినిధి ఉన్నం శ్రీనివాస రావు , పోలిశెట్టి కంపెనీ ప్రతినిధి శ్రీ రామాంజనేయులు, పొగాకు బోర్డు సిబ్బంది మరియు పొందూరు గ్రామ పొగాకు రైతులు పాల్గొన్నారు.
