తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదలకు వరమని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని 16వ వార్డులో సోమవారం ఆమె ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి ఈ పథకం కింద నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 2.50 లక్షల మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు. త్వరితగతిన ఎక్కువ గృహాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పథకం కింద నియోజకవర్గంలో 3241 ఇళ్లను పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం రూ. 3లక్షల వరకు ఈ పధకము కింద లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పి. ప్రభాకర్, జిల్లా హౌసింగ్ పీడీ మోహన్ రావు, డీఈ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, కూటమి నాయకులు బాబి, సాగర్, మద్దెల లక్ష్మి, షబానా తదితరులు పాల్గొన్నారు.