తొలి శుభోదయం కందుకూరు:-

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా మన కందుకూరు నియోజకవర్గానికి అత్యధికంగా CMRF నిధులు మంజూరు చేయడం హర్షణీయమని తెలియజేస్తున్నాను. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో 55 మంది బాధితులకు ₹59.05 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ అనేది అందనంత ఎత్తులో ఉండేది. కేవలం ప్రచారానికే పరిమితమై, కొద్దిమందికి మాత్రమే సాయం అందేది. కానీ, మన కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోంది. పేదలకు ఆపదొస్తే అప్పులపాలు కాకూడదన్నదే ముఖ్యమంత్రి తపన.మా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *