తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 (Public – Private – People – Partnership) కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలను నేడు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాం. ఈ సందర్భంగా నా విన్నపం ఒకటే.. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు తమ సొంత ఊరిలోని పేదలకు అండగా నిలవాలి. ముఖ్యంగా నిరుపేద పిల్లల చదువులకు, వైద్య అవసరాలకు చేయూతనివ్వాలని పిలుపునిస్తున్నాను. ఇప్పటివరకు 13,591 ‘బంగారు కుటుంబాలను’ గుర్తించాం.545 మంది మార్గదర్శకులు (Donors) ముందుకు వచ్చారు.ఇప్పటికే 3,000 కుటుంబాలను దత్తత తీసుకోవడం పూర్తయింది. సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్న దగుమాటి సుబ్బారావు , పిడికిటి వెంకటేశ్వర్లు , కాకుమాని ప్రవీణ్ కుమార్ గారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని కుటుంబాలకు అండగా నిలిచేందుకు మనమంతా కలిసికట్టుగా అడుగులు వేద్దాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *