తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ కొనిజేడు బస్ స్టాండ్ నందు ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఎంఎవై 2.0 పథకం ద్వారా నిర్మితమైన పక్కా గృహల గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నడం జరిగినది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ అందరకి స్వంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజల స్వంత ఇంటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని 2లక్షల 50 మంది స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నామన్నారు. ఇంటి స్దలాలు లేని పేదలకు స్దలం ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సొంతిల్లు లేని ప్రజలు ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కల నేరవేర్చుకోవాలన్నారు. సురేంద్ర బాబు చక్కగా ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని, ఈ రోజు జిల్లా కలెక్టర్ గారితో కలసి గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. 2014-19లో ఆనాడు 16,400 టిడ్కో ఇళ్ళు మంజూరు చేయగా, 4,128 ఇళ్ళను కట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఈ ఇళ్ళ నిర్మాణాలపై శ్రద్ద చుపలేదన్నారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ళ నిర్మాణాలను పూర్తీ చేయుటకు 39 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, పనులు కూడాజరుగుచున్నవని, సంబంధిత లబ్దిదారులకు త్వరలో ఇళ్ళు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజబాబు , ఉడా చైర్మన్ రియాజ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజల పాల్గొన్నారు.