తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-

పొగాకు క్వింటా 30 వేల రూపాయలు పైన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి-వీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొండేపి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం టంగుటూరు మండలం జమ్మలపాలెం లో గురువారం జి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి మాట్లాడుతూ పొగాకు, సెనగ పండించిన రైతాంగం ఉత్పత్తి ఖర్చులు పెరిగి సరైన ధరలు లేక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వీరారెడ్డి అన్నారు. పొగాకు చింత 30 వేల పైన కొనుగోలు చేసినట్లయితేనే రైతులు నష్టపోకుండా ఉంటారని అన్నారు. గత సంవత్సరం ప్రారంభ ధర 28,000 రూపాయలుగా కొనుగోలు చేయగా ఈ సంవత్సరం వింటా 25000 చొప్పున కొనుగోలు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఒకటి వదిలి కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు ప్రారంభించారు. మిగతా వేలం కేంద్రాల్లో ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ధరలు తక్కువగా ఉన్నాయి అని అధికారులు ప్రశ్నించగా ఇరానీ యుద్ధం కారణంగా ఆర్డర్ రాలేదని చెప్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై జిఎస్టిని 18 శాతం నుండి 40% పెంచడం కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. జీఎస్టీ 40 శాతం పెందుల కారణంగా సిగరెట్ ధరలు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ 18 రూపాయలు గతంలో అమ్మతుండగా ఇప్పుడు 23 నుంచి 25 రూపాయలు దాకా ఒక్కొక్క సిగరెట్ అమ్ముతున్నారు. అధిక ధరలకు అమ్మే లాభాలు గడిస్తున్న రైతుల దగ్గర ఉగాది మంచి ధర ఇచ్చి కొనుగోలు చేయడంలో వ్యాపారస్తులు ముందుకు రావటం లేదు. బోర్డు అధికారులు ప్రభుత్వం త్వరలో చెప్పి ఉగాది రైతులు నష్టపోకుండా చూడాలని వీరారెడ్డి కోరారు. గత రెండు సంవత్సరాల నుంచి రైతుల వద్ద ఉన్నటువంటి తెల్ల సెనగలను 3000 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని అన్నారు. భూ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో జి బాలకోటయ్య కృష్ణారెడ్డి జయంతి బాబు వెంకటేశ్వర్లు ప్రభాకర్ రెడ్డి రాము శేషయ్య సిపిఐ మండల కార్యదర్శి టి ప్రభాకర్ సుబ్బారావు మొదలగువారు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *