తొలి శుభోదయం పొన్నలూరు:-

పొగాకు బోర్డు పరిధిలోని పొన్నలూరులో సిరి – ఎఫ్ సి ఆర్-15 వంగడాల మధ్య ఉత్పత్తి, నాణ్యతలో పోలిక అనే అంశం మీద రైతులకు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం మంగళవారంజరిగింది. ఈ సందర్భంగా వేలం నిర్వహణ అధికారి వి.శివ కుమార్ ది గ్రేట్ మాట్లాడుతూ అడుగు ఆకులు వొదిలేసి పక్వానికి వచ్చిన వాటిని మాత్రమే రెలచాలి అని అన్నారు. ఆకు అల్లిక సమయం లో టార్పాలిన్ పట్టాలు విడిగా వాడాలి అన్నారు. గ్రేడింగ్ సమయంలో బుట్టలను అందుబాటులో ఉంచుకొని అన్యపదర్థాలను అందులో వేయాలని చెప్పారు. బారన్లో కురోమీటర్ఉపయోగించాలన్నారు. దీనివలన అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
బ్యారెన్ లో క్యురింగ్ సమయంలో తీసుకోవలసిన మెలుకువలు, క్యూరింగ్, గ్రేడింగ్ అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,పొగాకులో అన్యాపదర్ధాలు కలవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు సవివరంగా వివరించారు. సిటిఆర్ఐ హెడ్ అనురాధ మాట్లాడుతు శాస్త్ర సాంకేతికత వైవు దృష్టి సాధించాలని సూచించారు. మరియు ప్రస్తుత పరిస్థితులతో పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలును సూచించారు.ఈ కార్యక్రమంలో ఐ.టి.సి ప్రతినిదులు రత్నం విజయ్ కుమార్ ,జి.పి. ఐ ప్రతినిధి సుబ్బా నాయుడు , పి.ఎస్.ఎస్. శేఖర్ , పొగాకు బోర్డు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *