తొలి శుభోదయం నెల్లూరు:-
నెల్లూరు జిల్లాలో నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కోవూరు పట్టణంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది.కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి దుండగులు హత్య చేశారు. ఈ కేసులో పాల్గొన్న నిందితులు షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్లో దాక్కున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.నిందితులను పట్టుకునే ప్రయత్నంలో వారు కత్తులతో పోలీసులు మీద దాడి చేయడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ అనే నిందితుడికి మోకాలికి గాయం కాగా, ఒక పోలీస్ కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు.ఇద్దరినీ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.