తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అమరవీరులవారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు “లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుండి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. విద్యార్దులలో ఉన్న ప్రతిభను వెలికితీయటం, పోలీస్ శాఖ పట్ల పూర్తి స్ధాయిలో అవగాహన కల్పించడం మరియు పోలీస్ శాఖ పట్ల మంచి దృక్పథం, స్ఫూర్తి కల్పించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సు, భద్రత కోసం పోలీసులు అందిస్తున్న సేవలు, త్యాగాలను వివరించారు. పోలీసుల సేవలు, దైనందిన విధులు, త్యాగాలు పట్ల అవగాహన కలిగి, వాటిని గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.