తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో పోలీస్ పరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో SDPO కందుకూరు మర్రిపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కేసుల రికార్డులు, వివిధ రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణ, విధుల నిర్వహణ తీరును సవివరంగా పరిశీలించారు. రికార్డులు మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందే విధంగా పని చేయాలని పోలీస్ సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు.శాంతి భద్రతల పరిరక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని, నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విశ్వాసాన్ని పెంపొందించాలని ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో మర్రిపూడి ఎస్‌ఐ గారు పాల్గొని, స్టేషన్ పరిధిలో చేపడుతున్న పోలీస్ చర్యలు, ప్రజా భద్రతకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను ఎస్‌డీపీఓ కి వివరించారు. ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.